ఫ్రెండ్స్ భారతదేశానికి చెందిన జమ్మూ కాశ్మీర్ వ్యవహారంలో అమెరికా మరియు రష్యా వంటి ప్రసిద్ధ దేశాలు కూడా జోక్యం చేసుకుని సమయంలో నార్వే ఎలా జోక్యం చేసుకుందో ఈరోజు చూద్దాం. ప్రధాని మోదీ మెలోనీల మీమ్స్ తర్వాత ఇటలీ ప్రభుత్వం అకస్మాత్తుగా భారత్ పై ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేసింది? ఇండియన్ ఆర్మీకి సంబంధించి నేపాల్ లో ఎలాంటి నిరసనలు మొదలయ్యాయి భారతదేశాన్ని డీజిల్ అడిగిన తర్వాత బంగ్లాదేశ్ ప్రభుత్వం ఎలాంటి కొత్త ఆదేశాలు జారీ చేసింది.
సో ఇవే కాకుండా భారత్ పై ప్రభావం చూపే మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ కూడా చాలా ఉన్నాయి. అందుకే ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలానే [సంగీతం] మా ఛానల్ ని ఇప్పటివరకు సబ్‌స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
ఫ్రెండ్స్ ముందుగా భారత్ మరియు నార్వే గురించి మాట్లాడుకుందాం. ఇటీవలి కాలంలో చాలా దేశాల విదేశాంగ మంత్రులు పాకిస్తాన్ లో పర్యటించడం ప్రారంభించారు. ఇరాన్ అమెరికా మరియు మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న యుద్ధాల్లో పాకిస్తాన్ ఒక ముఖ్యమైన పాత్ర పోషించడం మొదలు పెట్టింది.
అందుకే చాలా దేశాలు పాకిస్తాన్ తో సంబంధాలు పెంచుకోవాలని చూస్తున్నాయి. అంతేకాదు ఇరాన్ యుద్ధం మొదలైనప్పటి నుండి సౌదీ అరేబియా టర్కీ, ఈజిప్ట్, యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు కెనడా విదేశాంగ మంత్రి మరియు ఇప్పుడు నార్వే విదేశాంగ మంత్రి కూడా పాకిస్తాన్ లో పర్యటించారు. అయితే పాకిస్తాన్ ఈ పర్యటనలను జమ్మూ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తడానికి వాడుకుంటుంది.
ఎవరైనా విదేశాంగ మంత్రి రాగానే పాకిస్తాన్ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ మరియు సింధూ నదీ జలాల ఒప్పందం గురించి మాట్లాడడం మొదలు పెడుతుంది. అయితే పాకిస్తాన్ అవకాశం కోసం చూడడం సాధారణమే. కానీ విదేశీ మంత్రులు ఎలా స్పందిస్తున్నారు అనేదే ఇక్కడ ముఖ్యం.
సో ఈసారి నార్వే విదేశాంగ మంత్రి అయిన ఆస్పిన్ బార్త్ ఈడే గారు పాకిస్తాన్ లో పర్యటించారు. మే నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెళ్ళినప్పుడు జార్జ్ సోరోస్ నిధులతో నడిచే ఒక జర్నలిస్ట్ ప్రధాని మోదీతో దుర్మార్గంగా ప్రవర్తించిన దేశమే ఈ నార్వే. ఆ సంఘటన పాతదైనప్పటికీ ఇప్పుడు నార్వే తమ విదేశాంగ మంత్రిని పాకిస్తాన్ కు పంపింది.
ఆయన పాకిస్తాన్ విదేశాంఘ మంత్రి అయినటువంటి ఇషాక్ డార్ తో కలిసి నిర్వహించిన విలేయకరుల సమావేశంలో జమ్మూ కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు. ఆస్పెన్ భారత్ ఈడే మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖతో జమ్మూ కాశ్మీర్ నుండి ఆఫ్ఘానిస్తాన్ వరకు ఉన్న అంశాలపై చర్చించానని ఈ చర్చల సమయంలో ఆయా దేశాలతో ఉన్న సంబంధాల్లోని సవాల గురించి కూడా మాట్లాడమని చెప్పారు. అంతేకాకుండా సౌదీ అరేబియా మరియు టర్కీలతో పరస్పర రక్షణ ఒప్పందం కుదుర్చుకున్నందుకు పాకిస్తాన్‌ను అభినందించారు.
ఈ మూడు దేశాలతో నార్వే కు చాలా మంచి సంబంధాలు ఉన్నాయని చెబుతూ ఈ ఒప్పందం పై సంతోషం వ్యక్తం చేశారు. నార్వే సంతోషపడినా లేదా బాధపడినా మనకు ఎలాంటి తేడా లేదు. కానీ నార్వే విదేశాంగ మంత్రి అసలు జమ్మూ కాశ్మీర్ అంశాన్ని ఎందుకు ప్రస్తావించారు అనేదే అత్యంత ముఖ్యమైన ప్రశ్న.
జమ్మూ కాశ్మీర్ అనేది భారత్ మరియు పాకిస్తాన్ మధ్య ఉన్న ద్వైపాక్షిక అంశంని ఇందులో మూడవ దేశం జోక్యానికి చోటు లేదని భారత ప్రభుత్వం అధికారికంగా స్పష్టం చేసింది. చివరికి అమెరికా రష్యాలు కూడా జమ్మూ కాశ్మీర్ అంశంపై ఎప్పుడూ మాట్లాడవు. అలాంటప్పుడు జమ్మూ కాశ్మీర్ అంశం గురించి చర్చించడానికి నార్వే ఎవరు?
వారికి ఉన్న అర్హత ఏమిటి? పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో జరుగుతున్న నిరసనలపై అక్కడ పాకిస్తాన్ సైన్యం 100 మందికి పైగా ప్రాణాలను తీసి అనేక మందిని గాయపరిచిన ఘటనలపై నార్వే విదేశాంఘ శాఖ మంత్రి ఎందుకు మాట్లాడలేదు? నియమాధారిత వ్యవస్థపై అంత శ్రద్ధ ఉంటే పిఓ కి నిరసనలపై కూడా ఆందోళన వ్యక్తం చేసి ఉండాలి.
అయితే ఈ వీడియో రికార్డ్ చేసే సమయానికి భారత ప్రభుత్వం నార్వే కు ఇంకా ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. కానీ విదేశీ నిధుల దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి భారత్ ఇటీవల తీసుకొచ్చిన ఎఫ్సిఆర్ఏ బిల్లు కారణంగానే నార్వే భారత్ పై ఆగ్రహంగా ఉండి ఉండొచ్చని కొందరు నిపుణలు భావిస్తున్నారు. ఎందుకంటే ఆ బిల్లు వల్ల నార్వే నిధులు సమకూర్చే క్రిస్టియన్ మిషనరీలపై తీవ్ర ప్రభావం పడుతుంది.
అసలు కారణం ఏదైనప్పటికీ చిన్న చిన్న దేశాలు జమ్మూ కాశ్మీర్ అంశంపై భారత్‌ను ఈ విధంగా వేలెత్తి చూపకుండా భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. ఇక తర్వాతి అప్డేట్ ఇటలీ మరియు భారత్ కు సంబంధించినది వస్తుంది. ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు ఇటలీ ప్రధాని జాజియా మెలోని ప్రధాని మోదీలతో అనేక మీమ్స్ వస్తుంటాయి.
అయితే ఇటీవల [సంగీతం] కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఢిల్లీలో ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రధాని మోదీకి ఇతర ప్రపంచ నాయకులను కౌగలించుకోవడమే విదేశాంగ విధానంలో ఒక భాగమని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ హటాతుగా కాంగ్రెస్ నాయకుడు సందీప్ దీక్షిత్ ను కౌగలించుకోగా సందీప్ దీక్షిత్ సరదాగా నన్ను మెలోనీ అనుకొని పట్టుకోలేదు కదా అని అన్నారు. ఈ మొత్తం సంఘటనపై భారత్‌లోని ఇటలీ దౌత్య కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ పై రాహుల్ గాంధీ చేసిన అవమానకరమైన వ్యాఖ్యలపై తీవ్ర ఆందోళన ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్యంలో రాజకీయ విభేదాలు ఉండవచ్చు. కానీ భారత్ యొక్క అంతర్గత రాజకీయాల విషయాల కోసం ఇటలీ ప్రధానిని ఎగతాలి చేయడానికి లేదా అవమానించడానికి ఉపయోగించకూడదని పేర్కొంది.
భారత్ యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థలను రాజకీయ చర్చలను తాము గౌరవిస్తున్నామని అలాగే ఇటలీ యొక్క ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నాయకత్వాన్ని మరియు ప్రధానిని కూడా అదే రీతిలో గౌరవించాలని ఆశిస్తున్నట్లు తెలిపింది. రాజకీయ చర్చలను స్వాగతిస్తామని కానీ తమ ప్రధాని అవమానాన్ని సహించబోమని స్పష్టం చేసింది. ఇరు దేశాలు పరస్పర గౌరవాన్ని మర్యాదను ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాలని ఇటలీ పేర్కొంది.
కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ చర్య వల్ల ఇటలీ నుండి కూడా భారత్ మాటలు వినాల్సి వస్తుంది. ఇక తర్వాతి అప్డేట్ తమిళనాడు శ్రీలంక మరియు భారత ప్రభుత్వానికి సంబంధించినది వస్తుంది. ఫ్రెండ్స్ శ్రీలంక నావికాదలం ఆగస్టు 12న తొమ్మిది మంది భారతీయ మత్స్యకారులను అరెస్ట్ చేసి వారి పడవును స్వాధీనం చేసుకుంది.
దీనిపై తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ విదేశాంగ మంత్రి జయశంకర్ కు నేరుగా లేఖరాశారు. ఎందుకంటే ఆగస్టు నెలలో శ్రీలంక తమిళనాడుకు చెందిన భారతీయ మత్స్యకారులను అరెస్ట్ చేయడం ఇది రెండోసారని ప్రస్తుతం మొత్తం 49 మంది మత్స్యకారులు శ్రీలంక కస్టడీలో ఉన్నారని లేఖలో పేర్కొన్నారు. శ్రీలంక నావికాదల చర్యల వల్ల స్థానిక మత్యకారులు తీవ్ర ఆందోళనలో ఉన్నందున ఈ విషయాన్ని శ్రీలంక ప్రభుత్వంతో మాట్లాడి మత్స్యకారులను విడిపించేలా వెంటనే జోక్యం చేసుకోవాలని జయశంకర్ ను కోరారు.
సో తర్వాతి అప్డేట్ పొరుగున ఉన్న బంగ్లాదేశ్ నుండి వస్తుంది. బంగ్లాదేశ్‌లో డీజిల్ కొరత కారణంగా ఆ దేశ ప్రభుత్వం వ్యాపారాలు షాపుల యజమానులు మరియు మాళ్ల కోసం కొత్త నిబంధనలతో ఒక సర్క్యులర్ ను జారీ చేసింది. షాపింగ్ మాల్‌లు మార్కెట్లు మరియు షాపులు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచాలని వేలలను ప్రకటించింది.
రాత్రి 8 గంటల తర్వాత వాటిని మూసివేయాలని ఆదేశించింది. దీంతో పాటు ప్రకటనల బిల్ బోర్డుల లైట్లను రాత్రి 7 గంటల వరకే నిలిపి వేయాలని రాత్రి 7 గంటలకే నిలిపి వేయాలని 7 గంటల తర్వాత ఏ బిల్ బోర్డ్ లైట్ కూడా వెలగకూడదని స్పష్టం చేసింది. మార్కెట్లను అలంకరించే విద్యుత్ దీపాలపై కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయి.
దీనితో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, మేళాలు మరియు వినోద కార్యక్రమాలపై కూడా విద్యుత్ ఇంధన మంత్రిత్వ శాఖ పరిమితులు విధించింది. బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందంటే విద్యుత్ కోసం భారత్ పై ఆధారపడిన బంగ్లాదేశ్ వద్ద దానిని కొనుగలు చేయడానికి నిధులు లేవు. పైగా బంగ్లాదేశ్ లోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు 50% సహజ వాయువు, 20 నుండి 25% బొగ్గు మరియు 20% ఫర్నేస్ ఆయిల్ ద్వారా నడుస్తాయి.
అంతర్జాతీయ మార్కెట్లో ఇవన్నీ రెట్టింపు ధరలకు పెరిగిపోయాయి. చిన్న వినియోగదారు కావడం వల్ల బంగ్లాదేశ్ కు ధరల చర్చల శక్తి కూడా తక్కువగా ఉంది. ఈ ఇంధనాల కొరత వల్ల ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తిని తగ్గించాల్సి వస్తుంది.
విద్యుత్ కోతలు పెరగడంతో షాపింగ్ మాల్‌లు, వ్యాపారులు డీజిల్ జనరేటర్ల వైపు మలుతున్నారు. దీంతో డీజిల్ వినియోగం డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయాయి. కానీ ప్రభుత్వం వద్ద డీజిల్ కూడా లేదు.
వారం క్రితమే డీజిల్ సర్ఫరా పెంచాలని బంగ్లాదేశ్ భారత్ ను కోరింది. ప్రజలకు విద్యుత్ ఇవ్వలేక ఇంధనాన్ని సమకూర్చుకోలేక వినియోగాన్ని తగ్గించడానికి ఉదయం 11 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు అంటే రోజుకు 9 గంటలు మాత్రమే వ్యాపారాలు నడవాలనే ఈ కొత్త విధానాన్ని తెచ్చింది. బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వం మరియు తారిక్ రెహ్మాన్ పరిస్థితి ఇలాగే ఉంటే ప్రజలే వీధుల్లోకి వచ్చి షేక్ హసీనాను మళ్ళీ ప్రధానిని చేయాలనే డిమాండ్ చేసే అవకాశం ఉంది.
అయితే షేక్ హసీనా హయాంలో ఉన్న పరిస్థితులను తారిక్ రెహ్మాన్ హయాంలో ఉన్న పరిస్థితులను పోలుస్తూ ఇప్పటికే బంగ్లాదేశ్ లో చర్చలు మొదలయ్యాయి. ఇక చివరి అప్డేట్ భారత్ మరియు నేపాల్ కు సంబంధించింది వస్తుంది. ఫ్రెండ్స్ భారత ప్రభుత్వం అగ్నివీరి పథకాన్ని ప్రకటించినప్పుడు కేవలం 25% క్యాండిడేట్లను మాత్రమే శాశ్వత సేవలకు ఉంచుకొని మిగిలిన 75% మందిని నాలుగేళ్ల స్వల్పకాలిక కాంట్రాక్ట్ తర్వాత విడుదల చేస్తామని [సంగీతం] చెప్పిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది.
అయితే ఆ సమయంలో నేపాల్ ప్రభుత్వం దీన్ని వ్యతిరేకించింది. ఇండియన్ ఆర్మీలో రిక్రూట్ అయ్యే నేపాల్ గుర్కాలను ఈ అగ్నివీర్ పథకం నుండి మినహాయించాలని లేదా పథకాన్ని వెనక్కి తీసుకోవాలని భారత్ ను కోరింది. ఎందుకంటే నాలుగేళ్ల తర్వాత తిరిగి వచ్చే 75% మంది యువతకు నేపాల్ లో ఉపాధి ఉండదు.
అయితే భారత్ నేపాల్ మాటను వినలేదు మరియు ప్రత్యేకాధికారాలు ఇవ్వకుండా అందరిలాగే 25% నిబంధననే వర్తింపచేసింది. దాంతో 2022వ సంవత్సరంలో నేపాల్ ప్రభుత్వం తమ యువత ఇండియన్ ఆర్మీలో చేరడంపై నిషేధం విధించింది. ఇప్పుడు నేపాల్ లో ఈ నిషేధాన్ని తొలగించాలని నిరసనలు ప్రారంభమయ్యాయి.
నేపాల్ లోని ఎక్స్ సర్వీస్ మెన్ మరియు యువత పోకరాలో నిరసనలు చేపట్టి ఇండియన్ ఆర్మీలో చేరడానికి అనుమతి ఇవ్వాలని భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు. బ్రిగేడ్ చైర్మన్ కళన్ కృష్ణ బహదూర్ కత్రి ఈ నిరసనలకు నాయకత్వం వహిస్తూ నేపాల్ ప్రజలు 200 ఏళ్లకు పైగా ఇండియన్ ఆర్మీలో సేవలు అందిస్తున్నారని కానీ నేపాల్ ప్రభుత్వ నిర్ణయం వల్ల ఈ చారిత్రిక బంధం తెగిపోతుందని యువతకు ఒక మంచి ఉపాధి అవకాశం దూరమవుతుందని అన్నారు. నేపాల్ యువకులు నాలుగేళ్ల తర్వాత తిరిగి వచ్చిన 40 నుండి 50 లక్షల రూపాయలు తీసుకువస్తారని ఇది గల్ఫ్ దేశాల్లో 50 డిగ్రీల ఉష్ణోగ్రతలో తక్కువ జీవితానికి పనిచేయడం కంటే 100 రెట్లు మేలు అని పేర్కొన్నారు.
గల్ఫ్ దేశాలకు వెళ్లే కంటే నేపాల్ యువత ఇండియన్ ఆర్మీలో చేరడమే మంచిదని నిరసన కారులు అంటున్నారు. మరి దీనిపై నేపాల్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. సో ఫ్రెండ్స్ ఈ పూర్తి వీడియో పై మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి.
థాంక్యూ జై హింద్.