నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ 100 శాతం అసెంబ్లీ సీట్లు గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తామనుకున్నారు చివరకు కేవలం 11 సీట్లతో ప్రతిపక్షానికి పరిమితమయ్యారు ఇలాంటి స్థితిలో ఎవరైనా ఓటమి పై సమీక్ష చేసుకుంటారు కానీ జగన్ మాత్రం ఎవరిని కలవడం లేదు జనాన్నే కాదు సొంత క్యాడర్ తోను సమయం గడపటం లేదు అంతెందుకు అసలు ఏపీ లోనే ఎక్కువగా కనిపించడం లేదు వారానికి నాలుగు రోజులు బెంగళూరులోనే ఉంటున్నారు జగన్ మారాలని నేతలు క్యాడర్ కోరుకుంటున్న ఆయన మాత్రం పద్ధతి మార్చుకోవటం లేదు అన్నీ చేసినా ఎందుకు ఓడామంటున్న జగన్ తాను చేసిన తప్పులు ఏంటో ఇప్పటికీ తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడం వైసీపీ కి ఆందోళన కలిగిస్తోంది అధినేత మారకుండా ప్రజలు పార్టీ పై అభిప్రాయం ఎలా మార్చుకుంటారని క్యాడర్ వాపోతోంది అసలు జగన్ చేయాల్సింది ఏంటి చేస్తుంది ఏంటి మార్పు దిశగా ఎందుకు
ఆలోచించడం లేదు ఏపీ లో ఐదేళ్ల పాటు తిరుగులేని అధికారం చలాయించిన జగన్ ఇంకా ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు ప్రతిపక్షంలో ఉన్నామనే సంగతి గుర్తులేనట్టుగా వ్యవహరిస్తున్నారు ఎప్పుడూ జనంలో ఉండాల్సిన జగన్ అసలు ఎవరికీ కనిపించడం లేదు సంక్రాంతి తర్వాత జనంలోకి వస్తానని చెప్పిన జగన్ ఉగాదొస్తున్న ఆ దిశగా అడుగులు ముందుకు వేయటం లేదు రాజకీయాల్లో ఉద్ధాన పతనాలు సహజం ఎన్నికలు అన్నాక గెలుపోటములు కూడా సహజమే కానీ ఏపీ లో వైసీపీ విషయంలో జరిగింది మాత్రం దేశంలో మరెక్కడా జరగలేదు 151 సీట్లతో తిరుగులేని అధికారం చలాయించిన పార్టీ కేవలం 11 సీట్లతో ప్రతిపక్ష పక్షానికి పరిమితం కావడం చిన్న విషయం ఏమీ కాదు ఇంత మార్పు ఏ కారణం లేకుండా జరగదనే వాదన గట్టిగా వినిపిస్తోంది ఇంత జరిగినా కూడా ఓటమిపై సమగ్ర రివ్యూ చేయలేదు జగన్ పార్టీలోనూ ఓటమికి దారి తీసిన కారణాలపై సమగ్ర చర్చ లేదు
పైగా నేను డబ్బులు ఇచ్చాను పథకాలు ఇచ్చాను అయినా ఎందుకు ఓడామని జగన్ అమాయకంగా ప్రశ్నిస్తున్నారు పథకాలు ఇచ్చిన జనం ఓడించారంటే పథకాలు పని చేయలేదా పాలన తీరు నచ్చక ఓటు వేయలేదా అసలేం జరిగిందన్న విషయంపై సమీక్ష చాలా అవసరం కానీ జగన్ మాత్రం మూడు రోజులు తాడేపల్లిలో నాలుగు రోజులు బెంగళూరులో ఉంటున్నారు ఈ వైఖరి క్యాడర్ నేతలకు అసంతృప్తి కలిగిస్తోంది ఇంత జరిగిన జగన్ జనంలోకి రాకుండా క్యాడర్ ను కలవకుండా ఉంటే ఎలాగన్న అభిప్రాయాలు వస్తున్నాయి కానీ జగన్ మాత్రం ఇవేమీ పట్టించుకోవటం లేదు కనీసం కోటరీని మార్చుకోవాలనే సూచనలను కూడా ఆయన పట్టించుకోవడం లేదు కొందరు నేతలు జగన్ చుట్టూ క్వాటరీగా ఏర్పడి ఎన్నికల్లో పుట్టి ముంచారని క్యాడర్ ఎత్తుకుంటున్న ఇప్పటికీ తాడేపల్లి ప్యాలెస్ లో అదే కోటరీ కొనసాగుతోంది ఈ విషయం కూడా వైసీపీ లో అసంతృప్తికి కారణం అవుతోంది ఎన్నికల్లో ఓటమి
తర్వాత అయినా జగన్ మారతారు అనుకుంటే ఎక్కడా ఛాయలు కనిపించడం లేదు గతంలో ఓసారి ప్రతిపక్షంలో ఉన్న జగన్ అప్పట్లో బాగానే జనంతో మమేకమయ్యారు నిరంతరం ఏదో యాక్టివిటీ తో పార్టీలో కూడా జోష్ తగ్గకుండా చూసుకున్నారు కానీ ఈసారి మాత్రం ఎందుకో తప్పులో కాలేస్తున్నారు ఓటమి బాధ్యత నాది కాదు ప్రజలదే అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు అధికారం కోల్పోయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని గమనిస్తే చాలా ఆవేదన ఆందోళన వ్యక్తమవుతుందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు గడిచిన ఐదు సంవత్సరాల్లో ఆ పార్టీ ఆడింది ఆట పాడింది పాట అన్నట్టుగా పాలన సాగింది అయితే ప్రస్తుతం అధికారాన్ని కోల్పోయిన తరుణంలో ఈ ఐదు సంవత్సరాలు పార్టీ మనుగడ ఒకింత ప్రశ్నార్థకంగా మారనుంది ముఖ్యంగా 175 స్థానాల్లో గెలుస్తామని అధికారం తమదేనని ఎన్నికలకు ముందు ముందు వ్యాఖ్యానించిన తరుణంలో ఇప్పుడు 11 స్థానాలు మాత్రమే రావడంతో జగన్ ప్రజలకు మొహం చూపించలేక పార్టీ
నాయకులను బుజ్జగించలేక సతమతమైపోతున్నారు జగన్ జనంలోకి ఎందుకు రావటం లేదో తెలియదు కానీ ఇదే అదునుగా ఎవరికీ తోచిన కారణాలు వాళ్ళు ఊహించేసుకుంటున్నారు ఈ ఊహలు పార్టీకి మరింత డామేజ్ చేసే అవకాశం ఉంది ఇంత జరుగుతున్న సరే జగన్ పొరపాట్లు దిద్దుకునే ఆలోచన కూడా చేయటం లేదు ప్రజల్ని కలవడం లేదు కనీసం సొంత క్యాడర్ కు దర్శనం ఇవ్వడం లేదు ఎవరైనా పార్టీ మీద అభిమానంతో జగన్ కి ఏమైనా చెప్పాలనుకున్న అవకాశం ఇవ్వడం లేదు పైగా జగన్ అపాయింట్మెంట్ కావాలంటే మళ్ళీ పాత కోటనే ఆశ్రయించాల్సిన దుస్థితి ఇలా ఉంటే ఎలా ఇలా ఉంటే కష్టమేనని వైసీపీ నేతలు కేడర్ కూడా ఆవేదన చెందుతోంది ఒక గొప్ప విజయం రాజకీయ పార్టీలను లేకపోతే రాజకీయ నాయకులను పారవస్యానికి గురి చేస్తే ఒక ఘోర పరాజయం అనేక పాఠాలు నేర్పిస్తుంది అంటారు కానీ వైఎస్సార్ పార్టీ అధినేత మాజీ
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విషయంలో ఆ విధంగా పాఠాలు నేర్చుకునే లక్షణం ఉందా అనే సందేహం కలుగుతుంది ఆ పార్టీని పరిశీలిస్తున్న వాళ్లకు కానీ ఆ పార్టీ నాయకులకు శ్రేణులకు ఎందుకంటే ఓటమి తర్వాత దాదాపు పది ఏళ్ళు గడిచిపోయినా కానీ ఆయన పని విధానంలో కార్యశైలిలో మాటల్లో చేతల్లో ఏమి తేడా కనిపించడం లేదు ఇది ఒక సందిగ్ధమైన పరిస్థితి గెలిచిన ఎమ్మెల్యే ల పరంగా చూస్తే ఎంతమంది వైసీపీ లో ఉంటారు ఎంతమంది జగన్ కు దూరం అవుతారు అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఎందుకంటే ప్రస్తుతం 11 మంది ఎమ్మెల్యే లను గెలిచిన వీరిలో వీర విధేయులు ఉన్నారని అనుకున్న నలుగురు ఐదుగురు మాత్రం గోడ దూకేసేందుకు రెడీ అవుతున్నారన్న సమాచారం స్పష్టంగా వినిపిస్తోంది వారిని కాపాడుకునే ప్రయత్నాలు జగన్ మోహన్ రెడ్డి చేశారా చెయ్యరా అనేది ఒక ప్రశ్న వారి సంగతి ఎలా
ఉన్నా అసెంబ్లీకి వెళ్ళడం వెళ్ళకపోవడం అనేది ఇప్పుడు మరో ప్రశ్న ఇది జగన్ రాజకీయ భవితవ్యాన్ని పెను సవాలుగా మారింది అసెంబ్లీకి వెళితే అవమానాలు ఎదుర్కోవాలి జగన్ తన హయాంలో ప్రవేశపెట్టిన పథకాలను గేలి చేస్తారు వీడియోలు ప్రదర్శిస్తారు వ్యాఖ్యలు చేస్తారు గత సర్కారు ప్రకటించిన పథకాలను ఎండగడతారు దీన్ని భరించాలి పోనీ దీన్ని భరించలేమని అసెంబ్లీకి దూరంగా ఉంటే అది మరింత పరువు తక్కువ అవుతుంది ఇక ప్రతిపక్షత హోదా కోసం జగన్ చేస్తున్న వాదన జనాలకు ఎక్కడ లేదు ఈ పంతానికి జగన్ ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పెట్టాలి ప్రతిపక్షత హోదా ఇవ్వలేదని అపవాదు ప్రభుత్వానికే వదిలేసి జగన్ తన పని తాను చేసుకుపోవాలి 11 మంది ఎమ్మెల్యే లు వచ్చారని అధికారం రాలేదు కాబట్టి అసెంబ్లీకి రావట్లేదన్న ప్రచారం జగన్ ను చుట్టుముడుతుంది దీని నుంచి తప్పించుకోవడం మరింత కష్టం ఇది ప్రజల్లోకి వెళుతుంది అసెంబ్లీలో
ఉంటే ఆయన వరకే పరిమితం అసెంబ్లీకి వెళ్ళకపోతే నేరుగా రాష్ట్రవ్యాప్తంగా టిడిపి నేతలు ఆ ప్రచారమే చేస్తారు ఇది మరో పెద్ద సమస్య మరో ముఖ్య విషయం ఏమిటంటే ఇప్పుడు ఐదేళ్ళు తట్టుకున్న వచ్చే ఎన్నికల నాటికి కూడా వైసపి పరిస్థితి ఏంటనేది చూస్తే అది కూడా కష్టమేనని అర్థమవుతోంది కూటమి ప్రభుత్వంలో ప్రధానంగా పవన్ కళ్యాణ్ ఇమేజ్ మరింత పెరుగుతూ ఉండడం దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది మొన్నటి ఎన్నికల్లో 21 స్థానాల్లో పోటీ చేసి 21 స్థానాల్లో గెలిచింది వచ్చే ఎన్నికల నాటికి సంఖ్య మరింత పెరగొచ్చు లేదా ఒంటరిగానే పోటీ చేయొచ్చు ఏం చేసినా పవన్ ఇమేజ్ ను పెంచుకుంటున్న తరుణంలో అది జనసేనకు ఉపయోగకరంగా మారుతుంది ఈ పరిస్థితుల్లో జగన్ మరింత జాగ్రత్తగా ఉండాలి ఈ స్థితిలో జగన్ ఇప్పుడు కాదు వచ్చే ఐదేళ్లకు కూడా దృష్టిలో పెట్టుకొని అడుగులు వేయాల్సిన అవసరం ఉందని పరిశీలకులు
సూచిస్తున్నారు అన్ని వైపుల నుంచి వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉండడం ముఖ్యంగా విధ్వంస పాలన అనే అపవాదుల్ని సరిదిద్దుకోవాల్సి ఉంది ఇప్పటికైనా ప్రజలకు చేరువు కావాలి నాయకులను కలుసుకోవాలి క్షేత్ర స్థాయిలో కేడను బలోపేతం చేయాలి నేను ఉన్నాను నేను విన్నాను అన్నమాట నిజం చేయాలి అలా కాకుండా ఇంటికే పరిమితమై ఇంట్లోనే కూర్చుంటారు అంటే ప్రత్యర్థుల దాడిలో మాడి మసైపోవడం ఖాయమని పరిశీలకులు సూచిస్తున్నారు భవిష్యత్తు ఇలా ఉండకూడదు అంటే ఎలా ఉండాలో జగనే డిసైడ్ చేసుకోవాలి జగన్ జాగ్రత్త పడక తప్పదు మొన్నటి దాకా వైయస్ జగన్ ఏపీ కి ముఖ్యమంత్రి ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నేనేత ప్రతిపక్ష నేనేత అయిన ఆ స్థాయికి తగినట్లుగా ఆయన వ్యవహరించట్లేదన్న వాదన వినిపిస్తోంది అంతేకాదు ఆయన పదే పదే చేస్తున్న వ్యాఖ్యలు కూడా ఆయన స్థాయిని తగ్గిస్తున్నాయని అభిప్రాయం వ్యక్తమవుతోంది తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని పదే పదే అడుగుతున్నారు
ఆ హోదా ఇవ్వకపోయినా ఆటోమేటిక్ గా ఆయనే ప్రతిపక్ష నేత అవుతారు అయినా స్పీకర్ ఇవ్వాల్సిందే అని పట్టుబడుతూ వాదిస్తున్నారు ప్రతిపక్ష హోదా అనేది స్పీకర్ ఇచ్చినంత మాత్రాన ప్రత్యేకంగా ఒరిగేదేమీ ఉండదు ఇవ్వనంత మాత్రాన పోయేదేమీ ఉండదు ప్రజల పక్షాన పోరాడితే అదే అసలైన పక్షం అవుతుంది ఈ చిన్న లాజిక్ జగన్ మిస్ అవుతున్నారన్న టాక్ వస్తుంది తమ పార్టీ నేతలు కార్యకర్తలపై టిడిపి వర్గాల వారు దాడులు చేస్తున్నారని జగన్ పదే పదే అంటున్నారు తనకు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఇవ్వాల్సిందే అంటున్నారు ఇలా తమ పార్టీ గురించి తన గురించి ఆయన ఎంతలా గగ్గోలు పెట్టిన దాని వల్ల ప్రజలకు లాభం ఏమీ ఉండదు దాని బదులు పథకాల అమలు ఎప్పుడని ప్రశ్నిస్తే ప్రజలు వైసీపీ వైపు చూస్తారు కానీ జగన్ తీరు అలా లేకపోవడం ప్రజలను ఆశ్చర్యపరుస్తోంది జగన్ మరో విధంగా కూడా తన
స్థాయిని తగ్గించుకుంటున్నారు ఆయన మొన్నటి దాకా సీఎం ఆ హోదాలో ఉన్నప్పుడు నారా లోకేష్ ను లెక్కలోకే తీసుకోలేదు పప్పు పప్పు అని తీసి పడేశారు ఇప్పుడేమో పదే పదే లోకేష్ ప్రస్తావన తెస్తున్నారు లోకేష్ రెడ్ బుక్ ఆధారంగా పాలన నడుస్తోందని చెప్తూ నారా లోకేష్ స్థాయిని పెంచుతున్నారు జగన్ మాట్లాడే తీరు చూస్తుంటే అంతా లోకేషే నడిపిస్తున్నట్లు పాలన అంతా ఆయన చెప్పు చేతల్లోనే సాగుతోంది అన్నట్లుగా మాట్లాడుతున్నారు జగన్ చంద్రబాబుని టార్గెట్ చేయాలి ఆయన స్థాయి అది కానీ లోకేష్ తో సరిపెట్టుకుంటూ తన స్థాయిని డౌన్ చేసుకుంటున్నారన్న టాక్ వినిపిస్తోంది ప్రతిపక్షతగా జగన్ అనుకున్న స్థాయిలో మార్కులు కొట్టలేకపోతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇదివరకు ప్రతిపక్షతగా ఉన్నప్పుడు కనీసం ప్రజల్లో ఉండేవారు ఇప్పుడు అటు అసెంబ్లీలో లేక ఇటు ప్రజల్లో లేకుండా మాటిమాటికి బెంగళూరు వెళ్ళిపోతూ తన పనులు మాత్రమే చూసుకుంటున్నారని ప్రజల కోసం ఏమీ చేయట్లేదని
టాక్ వస్తుంది జగన్ తన వైఖరి మార్చుకోకపోతే అది ఆయనకే నష్టం చేకూర్చగలదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఎన్నికల్లో ఘోర పరాభవం చవిచూసిన ఏ పార్టీ అయినా తాము ఏం తప్పులు చేసామో నిజాయితీగా ఆత్మ పరిశీలన చేసుకోవడం పరిస్థితులకు తగ్గట్టుగా తాము మారే ప్రయత్నం చేయడం ఆ తర్వాత పుంజుకోవడానికి కార్యాచరణ మొదలు పెట్టడం చాలా అవసరం కానీ వైసీపీ మాత్రం ఆ దిశగా ఆలోచన కూడా చేయటం లేదు జగన్ అండ్ వ్యవహార శైలి చూస్తుంటే ఇంకా ఆత్మ స్తుతి పరనింద తరహాలోనే సాగుతున్నట్లు కనిపిస్తోంది ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు సాయంత్రం పెట్టిన ప్రెస్ మీట్ తో మొదలు పెడితే లేటెస్ట్ గా పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో జగన్ వ్యాఖ్యలు చూసి అందరూ విస్తుబోతున్నారు తన పాలనలో వైఫల్యాలు తప్పిదాల ఊసే ఎత్తకుండా తాను చాలా గొప్పగా పరిపాలించిన అద్భుతాలు చేసిన జనాలు ఓడించడం ఏంటని
ఆయన ఆవేదన చెందుతున్నారు తాను మరీ ముక్కుసూటిగా ఉండడం నిజాయితీగా ఉండడం కరెక్ట్ కాదేమో అంటూ నిష్టూరాలుడారు అది నిజమైతే కావచ్చు కానీ గతం గతః ఇప్పుడేంటి అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయాలో చేయలేదో పక్కన పెడితే ఇప్పుడు ప్రతిపక్షంగా ఏం చేస్తారు ప్రజాస్వామ్యంలో అధికార పక్షానికే కాదు ప్రతిపక్షానికి బాధ్యత ఉంటుంది కానీ వైసపి మాత్రం తన పాత్ర ఏంటో మర్చిపోయే వ్యవహారం చేస్తోంది ఎంతసేపు ప్రజలు ఓడించారు ఓడించారని బాధపడుతున్న జగన్ తన పార్టీకి దాదాపు 40% ఓట్లు వచ్చాయి అన్న విషయాన్ని విస్మరిస్తున్నారు తమ ఓటు బ్యాంకు నిలబెట్టుకోవడానికైనా రాజకీయంగా యాక్టివేట్ అవ్వాలని అనుకోవడం లేదు జగన్ తీరు గనుక ఇలాగే ఉంటే వైసీపీ కి ఓట్లు వేసిన వాళ్ళు కూడా పునరాలోచనలో పడే ప్రమాదం లేకపోలేదు మంచో చెడో ప్రజలిచ్చిన తీర్పును గౌరవించాలి ఉన్న శక్తి మేరకు పోరాటం చేయాలి అసెంబ్లీలో స్పీకర్ ఇచ్చే కొద్ది
సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి సరైన పాయింట్ మాట్లాడితే అధికార పక్షాన్ని ఇరుకున పెట్టొచ్చు అందుకోసం హోం వర్క్ చేసి సభకు రావాలి కానీ సభలో అధికార పక్షానికి కౌంటర్ సంగతే వదిలేసి అసలు సభకే రాకుండా జగన్ ప్రవర్తిస్తున్న తీరు చూసి ఆయన అభిమానులు కూడా విస్తుపోతున్నారు ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు మీరు ఇవ్వనప్పుడు ప్రతిపక్ష పార్టీగా మా పార్టీకి గుర్తింపు మీరు ఇవ్వనప్పుడు ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు ఉండేటివి రెండే రెండు పార్టీలు రెండే రెండు కూటములు ఒకటి అధికార కూటమి రెండోది ప్రతిపక్షం ప్రతిపక్షం మాది తప్ప ఇంకెవరు లేరు అలాంటి మా పార్టీ 40% ఓట్ షేర్ వచ్చిన మా పార్టీకి ఉన్నది ఒకే ఒక్క ప్రతిపక్ష పార్టీ అయినా కూడా ఆ పార్టీని నువ్వు ప్రతిపక్షంగా గుర్తించన అంటావ్ ప్రతిపక్షంగా గుర్తిస్తే ఆ పార్టీకి ఒక నాయకుడు ఉంటాడు ఆయన ఆటోమేటిక్ గా ప్రతిపక్ష నాయకుడు
అవుతాడు ఒక్కసారి ప్రతిపక్ష నాయకుడు తాను అయినాడు అని అంటే ఒక హక్కుగా సభలో మైక్ తనకు ఇవ్వాల్సి వస్తుంది రాజకీయాల్లో అర్థం చేసుకోవాల్సిన మర్మం ఒకటి ఉంటుంది ప్రజలు ప్రభుత్వం పై వ్యతిరేకత వల్ల ప్రతిపక్షాన్ని గెలిపిస్తారు తప్ప ప్రతిపక్షంపై ప్రేమతోనో ప్రతిభ చూసో కాదు ఎదుటి వాడి వీక్నెస్ వల్ల వచ్చే అధికారం తప్ప తమ సొంత ప్రతిభ ఏమీ కాదని గుర్తించాలి ఎప్పటికప్పుడు ఆ ప్రభుత్వ వ్యతిరేక రాకుండా చూసుకోవాలి తప్ప తమ పాలన అద్భుతంగా ఉందని ప్రజలు అనుకుంటున్నారనే భ్రమలో కాలం గడిపేయకూడదు అలా గడిపే 2024 లో 11 సీట్లకు పరిమితమయ్యారు జగన్ మోహన్ రెడ్డి 11 సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా అయ్యింది ఇప్పుడు ఆ ప్రతిపక్ష హోదా కోసం వెంపర్లాడుతున్నారు జగన్ లేకపోతే లేకపోయిందిలే అని హుందాగా ఉండొచ్చు తొమ్మిది నెలల్లో ఏ ప్రెస్ మీట్ పెట్టిన నేను ప్రజలకు
పలావు పెట్టా చంద్రబాబు బిర్యానీ పెడతాడు అనుకున్నారు అంటూ కామెంట్స్ ప్రజల కు తాను పెట్టిన పలావు తేడా కొట్టిందన్న విషయం మాత్రం తెలుసుకోలేకపోతున్నారు జగన్ ఓటమికి కారణం ప్రజలకు చంద్రబాబు చెప్పిన అబద్ధపు వాగ్దానాలను నమ్మడమే అనుకుంటున్నారు జగన్ ఆయనను అలా నమ్మిస్తున్న క్వాటరీ జనం ఉన్నారు ఓటర్లు అంటే స్కీములు తీసుకొచ్చే వాళ్ళు మాత్రమే కాదు అన్ని వర్గాల వారు ఉంటారు ఏ వర్గానికి ఇబ్బంది కలిగింది ఏ వర్గం మానసికంగా దూరమైంది 11 సీట్లకు పరిమితమయ్యేంత ప్రభుత్వ వ్యతిరేకత ఎటు నుంచి వచ్చింది అనేది పరిశీలించుకోకుండా కనీసం ఆ దిశగా ఆలోచిస్తున్నట్టు గాని ఆత్మ పరిశీలన చేసుకున్నట్టు గాని జగన్ కనపడట్లేదు జగన్ మోహన్ రెడ్డి గారు గత చరిత్ర గుర్తు తెచ్చుకోవాలి ఆయన పోరాడి ఎలా నిలబడ్డారో 2009 నుంచి తర్వాత జైలుకి వెళ్లి వచ్చిన 2014 లో ప్రతిపక్ష నాయకుడి కింద ఉండి ఎలా
పోరాడారో గుర్తు తెచ్చుకోవాలి అంతే తప్ప ప్రతిపక్ష వాదం కోసం అంటే తెలుగుదేశం పార్టీ 1984 నుంచి 89 వరకు దేశ రాజకీయాల్లో ఉన్న లోక్సభలో ప్రధాన ప్రతిపక్షంగా ఉంది గుర్తింపు లేదు అంతెందుకు 2014 నుంచి 2024 వరకు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని దాదాపు ఐదు ఆరు దశాబ్దాలు శాసించిన కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా దిక్కు లేదు ఇది వాస్తవం అలాగే పి జనార్ధన్ రెడ్డి గారు ఉండగా 1994 లో 26 మంది శాసన సభ్యులతో ప్రతిపక్ష హోదా లేకుండా పోరాడలేదా ఆయనను మా బ్రదర్స్ మీ నాన్నగారు అందరూ పోరాడలేదండి అంతెందుకు ఆ రోజు జయపాల్ రెడ్డి గారికి అలాగే వెంకయ్య నాయుడు గారికి మధ్యకాలం ఓంకార్ గారు గాని ఎం సిపిఐ నేతలు గాని అలాగే సిపిఎం లో ఉన్న నర్ర రాఘవ రెడ్డి గారికి సిపిఐ లో అనేకమంది నేతలకి ఏం ప్రతిపక్ష
హోదాం ఉందని అయినా జనం గమనించేది పాలకులు ఏం చేస్తున్నారు అన్న దానితో పాటు ప్రతిపక్ష నాయకుడు ఏం చేస్తున్నాడు అనేది 2014 2019 మధ్యలో జగన్ నిత్యం జనంలో ఉండడం వల్ల చంద్రబాబు ప్రభుత్వం పై ఉన్న ప్రజా వ్యతిరేకత బాగా పెరిగింది నిరంతరం దీక్షలు ధర్నాలు నిరసనలతో వైసపి మొత్తాన్ని కదిలించారు అప్పట్లో ప్రతిపక్ష నేనేతగా జగన్ తర్వాత సుదీర్ఘకాలం పాటు చేసిన పాదయాత్ర కూడా అటు కేడర్ ను ఇటు ప్రజల్ని బాగా కదిలించారు జగన్ కు జనానికి మధ్య ఓ ఎమోషన్ బిల్ చేసింది అప్పట్లో జగన్ పోరాటాలు కూడా డైరెక్ట్ గా జనాన్ని ఇబ్బంది పెట్టే అంశాలను బేస్ చేసుకొని సూటిగా ఉండేవి దీంతో జనం కూడా పెద్ద ఎత్తున జగన్ వెంట ర్యాలీ అయ్యే అవకాశం వచ్చింది ప్రభుత్వం పై అసంతృప్తి ఉన్న వాళ్ళందరికీ అప్పట్లో జగన్ ఓ ఆశా కిరణంలా కనిపించారు
ఇప్పుడు ఏపీ లో సమస్యలు లేవని కాదు కూటమి సర్కారు ఇచ్చిన హామీల్ని పూర్తి స్థాయిలో నెరవేర్చలేదు లిక్కర్ ఇసుక మైనింగ్ దందాలు నడుస్తున్నాయి జగన్ జనంలోకి వచ్చి పోరాడలే కానీ 190 అంశాలు ఉన్నాయి అయినా సరే జగన్ గడప దాటకపోవడం పై వైసీపీ లోనూ చర్చ నడుస్తోంది పదవిలో ఉన్నళ్ళు జనం వద్దకి నిత్యం రారు అలాంటప్పుడు ఆ గ్యాప్ ను ప్రతిపక్ష నాయకుడు ఫిల్ చేసుకోవాలి ఆ స్పేస్ ను లాక్కోవాలి ఇది జగన్ కు తెలియంది కాదు మర్చిపోయారు అంతే జగన్ జనంలోనే ఉంటూ పాలక పక్షాన్ని బెదరగొట్టాలి అది జరగాలంటే కోటరీ తన ఉనికికి రాజకీయ భవిష్యత్తుకు అడ్డుగోడని తెలుసుకోవాలి అసలు ఇది జగన్ కు తెలియ చెప్పేవాళ్లే లేదు చెప్పిన వినే స్థాయి దాటిపోయిందా అనే తెలియదు విన్నా వినకపోయినా మారినా మారకపోయినా జనంలోకి వెళ్ళినా వెళ్ళకపోయినా ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకతే వస్తే
ఆటోమేటిక్ గా మళ్ళీ ప్రతిపక్షాన్ని గెలిపించేస్తారు కనుక పదవిలోకి వచ్చేయొచ్చు అనుకుంటే ఎవ్వరు ఏమీ చెప్పనక్కర్లేదు ఆయన వినక్కర్లేదు కానీ మానవ ప్రయత్నం లేకుండా ఉంటే ఆ స్థానాన్ని మరో పార్టీకి చెందిన మరొక నాయకుడు ఆక్రమించే అవకాశం ఉంది ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఆటోమేటిక్ గా పడాలంటే జనం మనసు లో ఉండాలి అలా ఉండాలంటే జనంలో ఉండాలి అలా లేకపోతే భవిష్యత్తులో టిడిపి కి జనసేనకు చెడి ఇద్దరు విడిగా పోటీ చేసినప్పుడు జనం ఏదో పార్టీకి గుద్దేసిన ఆశ్చర్య పోనక్కర్లేదు తదుపరి ఎన్నికల నాటికి ప్రభుత్వ వ్యతిరేకతతో గొంతు కలిపి పవన్ కూటమి నుంచి బయటకు వచ్చేసి సొంత గొంతు వినిపిస్తే అతనే ప్రతిపక్షం అవుతాడు ఆ పరిస్థితి రాకూడదు అనుకుంటే రాష్ట్రంలో మూడవ ప్రత్యామ్నాయం రాకుండా చూసుకోవాలి దానికి ఒక్కటే మార్గం జగన్ నిత్యం జనంలో ఉండడం తిరగడం పరిస్థితి చూస్తుంటే జగన్ ప్రతిపక్షంలో ఉంటూ
కూడా కొత్త సమస్యలను కొని తెచ్చుకునేలా కనిపిస్తున్నారు అధికారంలో ఉన్నప్పుడు కోట్రిని నమ్ముకొని కొన్ని తప్పులు చేసిన జగన్ జనం నాడి పట్టడంలో విఫలమయ్యారు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా జనాన్ని కలవకుండా పెద్ద తప్పు చేస్తున్నారు సర్కారు పనితీరు ఎలా ఉందో ఏ వర్గం అసంతృప్తిగా ఉందో తెలియాలంటే ప్రజల్ని కలవాలి అంతే కానీ ఎవరిని కలవకుండా ఎవరితో చర్చించకుండా ఎలాంటి వ్యూహ రచన చేయకుండా ఎంత సేపు నేను నా పథకాలు అనే పాయింట్ చుట్టూ తిరిగితే జగన్ కు ఏ కోశాన ప్రయోజనం ఉండదన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది రాజకీయాల్లో నేతలు మంచి చేశారా చెడు చేశారా అనేది ప్రజలే తేలుస్తారు ఏ నాయకుడు నిర్ణయాలు తీసుకునే అడ్వాంటేజ్ అవుతాయనే తీసుకుంటారు కానీ ఓసారి ప్రజలు తిరస్కరించాక తమ పద్ధతి మార్చుకొని కొత్త ఎజెండాతో జనం ముందుకు వస్తారు మొదటి నుంచి వస్తున్న
పద్ధతి ఇదే కానీ జగన్ మాత్రం అలా ఉండడం లేదు గెలిచినా ఓడినా నా పద్ధతి మారదని అని గొప్పగా చెప్తున్నారు ఎన్నికల్లో ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుని ఫీనిక్స్ లా పుంజుకున్న నేతలు గతంలో ఉన్నారు అలాగే ఓటమి ఎప్పుడూ ప్రతి ఒక్కరికి గుణపాఠాలు నేర్పుతుంది కానీ వాటిని నేర్చుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి జగన్ అలా లేకపోవడమే వైసీపీ భవితవ్యంపై సందేహాలు వచ్చేలా చేస్తోంది అసలు మొన్నటి ఎన్నికల ప్రచారం నుంచే జగన్ గాడి తప్పారని అభిప్రాయాలు లేకపోలేదు చెప్పినట్టుగా సంక్షేమం చేశాను అభివృద్ధి కూడా మొదలు పెట్టాను మరో అవకాశం ఇస్తే అది కూడా పూర్తి స్థాయి లో చేస్తానని ఓట్లు అడిగితే ఫలితం వేరుగా ఉండేది కానీ జగన్ ఎక్కడ అభివృద్ధి ఊసెత్తకుండా జాగ్రత్త పడ్డారు పైగా ఎక్కడికి వెళ్ళినా పథకాల గురించే ఊదరగొట్టారు దీంతో జనానికి మొహం మొత్తింది జగన్ ఏమైనా తన జేబులో
డబ్బు ఇస్తున్నాడా మేము కట్టిన పన్నుల డబ్బులే మాకు ఇస్తున్నారు కదా అనుకున్నారు ఈ కారణంగానే స్కీముల లబ్దిదారుల ఓట్లు కూడా పూర్తి స్థాయిలో వైసీపీ కి పడలేదన్న విశ్లేషణలు అప్పట్లో వచ్చాయి కానీ జగన్ ఇవేమీ పట్టించుకోవడం లేదు ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చా కూడా ఇంకా బటన్ నొక్కాను నేరుగా అకౌంట్లలోకి డబ్బులు వేసానని పదే పదే చెబుతున్నారు చేసిన పొరపాట్లు గుర్తించి అవి మరోసారి జరగకుండా చూసుకుంటానన్న మాటే జగన్ నోటి నుంచి రావడం లేదు అటువైపు చూస్తే టిడిపి గట్టి క్యాడర్ ఉన్న పార్టీ ఇటువైపు వైసపి క్యాడర్ తీవ్ర నిరాశలో ఉంది తాము మొదటి నుంచి పాలన తేడా కొడుతుందని చెప్పినా పట్టించుకోలేదని వాపోతున్నారు బలంగా ఉన్న ప్రత్యర్థుల్ని డీ కొట్టాలంటే ఖచ్చితంగా కార్యకర్తల్లో నైతిక స్థైర్యం పెంచడం అవసరం అధినేత ఎప్పుడు కావాలంటే అప్పుడు క్యాడర్ ను కలిస్తే వారి మాటలు వింటే మరింత
ఉత్సాహంగా పని చేస్తారు అంతేకానీ దర్శనమే దుర్లభం అంటే మాత్రం ఎంత కష్టపడ్డా ఫలితం ఏముంది అనుకోవచ్చు ఒక్కసారి క్యాడర్ విరక్తి చెందితే పార్టీకి పూర్వ వైభవం రావడం అంత తేలిక కాదు అందుకే ఇప్పటికైనా జగన్ మేలుకోవాలి జనంలోకి రావాలి జనంతో మమేకం అవ్వాలి క్యాడర్ సాధక బాధకాలు తెలుసుకోవాలి క్యాడర్ బలంగా ఉంటేనే పార్టీ బాగుంటుందని గుర్తుంచుకోవాలి ప్రజాస్వామ్య వ్యవస్థలో నాయకుల యొక్క స్ట్రెంగ్త్ నాయకుల యొక్క నాయకుల యొక్క వీక్నెస్ పార్టీ వర్కర్స్ ప్రజలు ఓటర్స్ వీళ్ళతో ఎంత సన్నిహిత సంబంధాలు ఉంటే అంత గట్టి పునాదులు వేసుకుంటారు నాయకులు ఎవరైతే వర్కర్స్ కి పార్టీ వర్కర్స్ కి గాని కార్యకర్తలకు గాని లేక ప్రజలతో గాని దూరంగా ఉండి ఏదో ఎలక్షన్ టైం లో మేము వాళ్ళని కలిస్తేనో ఇది అదో ప్రామిస్ చేశాను ఓట్లు పడతాయి అంటే అది సాధారణంగా జరగదు ఎప్పుడు కూడా
నాయకులు ప్రజల్లో ఉండండి ప్రజలను కలుసుకుంటూ ప్రజల యొక్క మంచి చెడ్డలు తెలుసుకుంటూ అదే కాకుండా తాము ఏం చేయగలుగుతాం తాము అపోజిషన్ పార్టీలో ఉంటే ప్రభుత్వం ఏం చేయలేకపోతుంది నేను ఏం చేయగలను మా పార్టీ ఏం చేయగలదు అని చెప్పగలగాలి ఏ పార్టీకైనా శ్రేయోభిలాషులైన నేతలు నమ్మకమైన అంకిత భావంతో పనిచేసే కేడరే పెట్టని కోట ఈ సంగతి జగన్ త్వరగా గుర్తిస్తే మంచిది లేకపోతే తర్వాత ఆయనకు ఉత్సాహం వచ్చినా పార్టీ పరిగెత్తకపోవచ్చు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఉండదు ఇప్పటికైనా సమయం మించిపోలేదు జగన్ తన వైఖరి మార్చుకుంటే వైసీపీ కి బలపడే అవకాశం ఉండొచ్చు ఈ విషయం కొందరు సన్నిహితులు చెబుతున్నా కూడా జగన్ చెవికి ఎక్కించుకోవడం లేదన్న వాదన వినిపిస్తోంది