నమస్తే వెల్కమ్ టు ఐనూస్ మన రోజు చూసే మనుషుల్లోనే మన పక్కన తిరిగే వారిలోనే అత్యంత క్రూరమైన హంతకులు దాగి ఉంటారంటే నమ్ముతారా 2000 సంవత్సరంలో అలహాబాద్‌లో కనిపించకుండా పోయిన ఒక జర్నలిస్ట్ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఒల్లు గగ్గురు పుడిచే నిజాలు తెలిసాయి. ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగి తనను తాను రాజుగా ఊహించుకుంటూ వింత తీర్పులు ఇస్తూ 14 మందిని చంపి వారి మెదళలతో సూప్ చేసుకొని తాగేవాడంటే నమ్మగలరా? దేశాన్ని ఉలికిపడల చేసిన కలందార్ రాజు అనే సైకో కిల్లర్ కథ ఏంటో ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం.
[సంగీతం] డిసెంబర్ 17, 2000 సంవత్సరం అలహాబాద్ కు చెందిన జర్నలిస్ట్ ధీరేందర్ సింగ్ అదృశ్యమయ్యాడు. అతని కుటుంబం ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. దర్యాప్తులో ధీరేందర్ చివరి కాల్ స్థానిక రాజకీయ నాయకురాలు పూలందేవి ఇంటి ల్యాండ్ లైన్ కు వెళ్ళినట్లు తేలింది.
ఆమె భర్త రామ్ నిరంజన్ విచారించగా పొంతన లేని సమాధానాలు చెప్పాడు. ధీరేందర్ సింగ్ బైక్ ఫోన్ రామ్ నిరంజన్ పని చేసే సెంట్రల్ ఆర్డినెన్స్ డిపో దగ్గర దొరకడంతో పోలీసుల అనుమానం బలపడింది. ఈసారి గట్టిగా విచారించడంతో రామ్ నిరంజన్ నోరు విప్పాడు.
కానీ అతను చెప్పిన కథ విని పోలీసులు షాక్ అయ్యారు. తాను చేయలేదని హత్యలన్నీ కలందర రాజు అనే ఒక వ్యక్తి చేశాడని చెప్పాడు. తన పొలంలోని గదికి తీసుకెళ్లి అక్కడ పడి ఉన్న రెండు పుర్రలను చూపిస్తూ వీరిని కలందర్ రాజు చంపాడు అన్నాడు.
చెట్టుకు ట్రోఫీల్లా వేలాడుతున్న రంగు రంగుల పుర్రలను చూపిస్తూ వాళ్ళందరిని కూడా ఆ రాజు చంపాడని చెప్పాడు. ఒక్క మిస్సింగ్ కేసు కోసం వెళ్ళిన పోలీసులకు అక్కడ 14 పుర్రెలు కనిపించాయి. ఇంతకీ కలందర రాజు ఎవరు అని పోలీసులు గద్దించగా నేనే కలందర రాజు అంటూ రామ నిరంజన్ ఇచ్చిన సమాధానంతో పోలీసుల మైండ్ బ్లాంక్ అయింది.
తనే రాజులని తన కోర్టులో తానే తీర్పులు ఇస్తానని చెప్పాడు. తన కొడుకులకు అదాలత్ అంటే కోర్టు జమానత్ అంటే బెయలని పేర్లు పెట్టుకున్న ఈ సైకో తన అరాచకాలను ఒప్పుకున్నాడు. జర్నలిస్ట్ ధీరేందర్ సింగ్ తన గురించి పేపర్లో రాస్తాడనే భయంతో చంపానని చెప్పాడు.
మిగతా వారిని ఎందుకు చంపావని అడగగా వాళ్ళంతా చాలా తెలివైన వారిని వారి మెదడును సూప్ చేసుకొని తాగితే ఆ తెలివి తనకు వస్తుందని నమ్మేవాడినని చెప్పి పోలీసులను నిబ్బరపరిచాడు. చంపిన వారిని గుర్తుపెట్టుకోవడానికి పుర్రెలకు రంగులు వేసి పేర్లు రాసుకునేవాడు. అతని ఇంట్లో దొరికిన ది కోర్ట్ డైరీలో అతను చంపిన 14 మంది పేర్లు ఉన్నాయి.
చిన్నప్పటి నుంచి తెలివితేటలు తక్కువగా ఉండడంతో ఇలాంటి పైశాచకత్వానికి పాల్పడ్డాడు. 12 ఏళ్ల విచారణ తర్వాత 2012 లో కోర్టు ఈ నరరూప రాక్షసుడికి జీవిత ఖైదు విధించింది. ఒక మామూలు మనిషి ముసుకులో దాగి ఉన్న ఈ సైకో కిల్లర్ కథ మన చుట్టూ ఎలాంటి వాళ్ళు ఉన్నారో నిరూపించింది.